![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -144 లో.....కన్నా కాలేజీకి వెళ్తుంటే నేను దింపుతానని చక్రి అంటాడు. అవసరం లేదని చక్రితో కన్నా కోపంగా అంటాడు. ఎందుకు.. ఏమైంది.. మీరు అసలు ఎప్పుడు తప్పు చెయ్యలేదా.. నేను చేసిన ఒక్కదానికి ఇంతలా చేస్తున్నారని చక్రి అంటాడు. ఒక అమ్మాయి గడియ కూడా పెట్టుకోకుండా గదిలో పడుకుందంటే తనకి మనమంటే ఎంత నమ్మకం ఉండాలి. ఆ నమ్మకాన్ని నువ్వు పోగొట్టావని మాధవ అంటాడు. నేను గదిలోకి మాత్రమే వెళ్ళానని చక్రి అంటాడు. ఒక అమ్మాయి ఒంటి మీద చెయ్ వేస్తేనే తప్పు చేసినట్లు కాదు.. తనని ఇబ్బంది పెట్టే ఒక చిన్నచూపు చాలు అని మాధవ చెప్తాడు.
ముగ్గురు కూడా చక్రిని ఆహ్యించుకుంటారు. చక్రి బాధపడుతూ కార్ లేదు.. లైసెన్స్ లేదు.. మహా లేదని అంటాడు. ఆ తర్వాత బంటి దగ్గరికి శైలు వస్తుంది. మీ అన్న అసలు నన్ను పట్టించుకోవడం లేదు.. తను కూడా నన్ను ప్రేమిస్తున్నాడు కానీ బయటపడడం లేదు.. నేను చెప్పినట్లు చెయ్.. మీ అన్న కూడా బయటపడతాడని బంటికి శైలు ఏదో చెప్తుంది. మరోవైపు చక్రి వెళ్తుంటే ఇద్దరు ఆడవాళ్లు మీ ఆవిడ వెళ్ళిపోయిందంట కదా.. అయినా మీ ఇంట్లో ఎవరుంటారులే అని వాళ్ళు అంటారు. దాంతో వాళ్ళతో చక్రి గొడవపడతాడు. అప్పుడే కేశవ వచ్చి.. తన షాప్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. నాకు చాలా బాధగా ఉందిరా తనని నిజంగా ప్రేమించాను.. దూరంగా ఉంటే భరించలేకపోతున్నానని చక్రి అనగానే తను తప్పకుండా నిన్ను అర్ధం చేసుకొని వస్తుందిరా అని కేశవ చెప్తుంటాటు. ప్రేమ అంటే తెలియని వాడివి ప్రేమ పాటలు చెప్తున్నావని చక్రి అంటాడు. ఆ తర్వాత మహా ఆఫీస్ కి చక్రి వెళ్తాడు. అదే సమయంలో దివ్య లోపలికి వెళ్తుంటే మహాని బయటకు రమ్మని చెప్పండి అని చక్రి తమతో అంటాడు. మహా బయటకు వచ్చి ఎందుకు బయటకు వచ్చారని కోప్పడి వెళ్తుంది. మహా కోపంగా ఉండడం విక్కీ చూసి ఏమైందని అంటాడు. ఏం లేదని మహా చెప్తుంది.
ఆ తర్వాత కేశవ దగ్గరికి బంటి వచ్చి.. ఇక రేపటి నుంచి శైలు రీల్స్ చెయ్యదంట.. తనకి పెళ్లిచూపులు అని బంటి చెప్పగానే కేశవ షాక్ అవుతాడు. ఆ తర్వాత రాత్రి కేశవ ఇంటికి వచ్చి బంటి చెప్పిందే గుర్తుచేసుకుంటాడు. ఇంకా ఎంత సేపురా ఆకలి అవుతుందని నారాయణ అంటుంటే తిండి లేకుండా ఉండలేవా.. అన్నయ్య ఏమైనా ఖాళీగా ఉన్నాడా అని కేశవ కోప్పడుతాడు. దాంతో నారాయణ తినే ప్లేట్ అక్కడ పెట్టి వెళ్తాడు. వదిన ఇప్పుడు గనుక ఉంటే తినే అతనితో అలా మాట్లాడావని కోప్పడేదని కన్నా అంటాడు. కేశవ దగ్గరికి మాధవ వెళ్లి భోజనానికి రమ్మని చెప్తాడు. తరువాయి భాగంలో బెలున్స్ పై సారీ అని రాసి హాస్టల్ కిటికీ దగ్గర మహాకి కన్పించేలా చక్రి పంపిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |